బొలెరో వ్యాన్ బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు కి బలమైన గాయాలు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కోరంగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు వేడిద గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బైక్ ని ఢీ కొట్టిన బొలెరో వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
