Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

ఎస్ సి వర్గీకరణ అమలుకు అసెంబ్లీలో ఆమోద ఆర్డినెన్స్ తెలపాలి దండు వీరయ్య మాదిగ

రాష్ట్ర అరుంధతి మహిళా అధ్యక్షురాలు కొమ్మని కవిత ఆధ్వర్యంలో ఎమ్ ఆర్ పి ఎస్ సభా సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్ ఆర్ పి ఎస్ అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ విచ్చేశారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూలు కులాల వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరములు గడిచింది. మాదిగ ఉపకులాలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్ ఫలాలు వారి జనాభా దామెషా ప్రకారం రావటం లేదు. 2000 నుండి 2004 వరకు గతంలో వర్గీకరణ అమలైనందున కొంతమేర న్యాయం జరిగింది. 2004లో సుప్రీంకోర్టు వర్గీకరణ రద్దు చేయడంతో, మాదిగ ఉపకులాలు నిరుద్యోగ సమస్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల అనగా 1-08-2024న సుప్రీంకోర్టు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని ఏడుగురు కలిసిన న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పునిచ్చింది. సదరు తీర్పు అమలుకు శాసనసభలో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేయాలి అని అన్నారు.

అంతే కాకుండా దళితులకు విదేశీ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించాలి అని, దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను పెద్దలనుండి కాపాడి POT 1977 యాక్ట్ ప్రకారం వీరి భూములు వీరికి తిరిగి అప్పచెప్పాలి అని, ఒక ఐఏఎస్ అధికారి చేత ఎంక్వైరీ చేయించాలి అని, నవంబర్ 11 నుంచి 20 వరకు రాష్ట్రం లో అన్ని జిల్లాల కలెక్టరేట్ లందు ధర్నా చేస్తున్నట్లు వీరయ్య మాదిగ తెలిపారు.

కొమ్మని కవిత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను, హత్యలను, అత్యాచారాలను అరికట్టడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి కఠినంగా ఉండాలి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొకినాల సాంబశివరావు, చేరుకూరు సుజాత, ఉచ్చుల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

Andhrateachers.com

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

Andhrateachers.com

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Andhrateachers.com

Leave a Comment