Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ ప్రారంభం

అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను‌ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో యువత గుండెపోటు బారిన పడుతున్నారని చెప్పారు. గుండె సంబంధిత సమస్యలు వస్తే నిపుణులను సంప్రదించడం అత్యవసరం అన్నారు. కార్డియాక్ మరణాలను నివారించడానికి ఈ క్లినిక్‌ ఉపయోగపడుతుందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా అపోలో సేవలు విస్తరించాలని సూచించారు.ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు.మహిళా రక్షణకు ఎన్డియే ప్రభుత్వం అధిక ప్రాదాన్యత ఇస్తుందని చెప్పారు. పోలీస్ డిపార్టమెంట్ కు టెస్ట్ లు చెయ్యాలని మంత్రి కోరగా,అపోలో యాజమాన్యం సానుకూలంగా స్పందించారు.

Related posts

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక*

Andhrateachers.com

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

Andhrateachers.com

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

Andhrateachers.com

Leave a Comment