రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు కృషి చేస్తునారు. ఇందులో భాగంగా మెట్ పల్లి పట్టణం లోని RTC బస్ డిపో సర్కిల్ దగ్గర గుంతలు ఏర్పడ గా వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల సౌకర్యం మరియు వారి భద్రత దృష్ట్యా మెట్ పల్లి ఎస్.ఐ కిరణ్ కుమార్ గారు మానవత ద్రూక్పధo తో స్థానికుల సహాయంతో కంకర తెప్పించి రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న ఎస్.ఐ ని పట్టణ ప్రజలు, వాహనదారులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
