Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

*పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

 

*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

 

*నాగలాపురంలో రూ.30 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ*

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమం తో గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.

 

గురువారం నాగలాపురం లో బీసీ కాలనీ నుండి ఈస్ట్ హరిజనవాడ వరకు రూ.30 లక్షలు పల్లె పండుగ నిధులతో 30 మీటర్ల మేర సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

 

అంతకుముందు అక్కడే ఉన్న వినాయక స్వామి ఆలయం లో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.

 

కూటమి ప్రభుత్వ హయాంలో పంచాయితీలకు విరివిగా నిధులు కేటాయించి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు.

 

అందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాన్ని అమలు గ్రామీణ చేసి సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం పై దృష్టిసారించిందన్నారు.

 

గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పంచాయితీ వ్యవస్థ పటిష్టతకు పల్లె పండుగ వారోత్సవాలు ద్వారా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

 

ఈ కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రేపు విద్యుత్ అంతరాయం* 

Andhrateachers.com

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

Andhrateachers.com

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

Andhrateachers.com

Leave a Comment