Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

పల్లెలు ప్రగతి తెదేపాకే సాధ్యమని సత్యవేడు నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీపతి బాబు పేర్కొన్నారు కేవీబీ పురం మండలం కండ్లురు, బ్రాహ్మణపల్లి, ఆదరం గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతి బాబు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు, విద్యాభివృద్ధి, పంచాయతీల అభివృద్ధి ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు టిడిపి పార్టీ ఎంతో క్రమశిక్షణతో ఉందని, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఎక్కడ అవకతవకలు లేకుండా అభివృద్ధి ప్రధానంగా ముందుకెళ్తోందని శ్రీపతి బాబు తెలిపారు ఈ సందర్భంగా పై గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు కార్యక్రమంలో టిడిపి శ్రేణులు, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు ప్రతి పంచాయతీలోనూ ఈ పల్లె పండుగ వాతావరణం సంక్రాంతి పండుగగా ఐదేళ్ల అనంతరం జరుగుతుండడం పట్ల నియోజకవర్గ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Related posts

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*  *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

Andhrateachers.com

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

Andhrateachers.com

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

Andhrateachers.com

Leave a Comment